అర్జీలు పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
1 min read

అధికారులు ఫిర్యాదు దారులుతో మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపాలి
పిజిఆర్ యస్ లో అందిన అర్జీలు 268
జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయీ అధికారులతో జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి నిర్వహించారు. జిల్లా జాయింటు కలెక్టరుతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి యం. ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, డిఆర్డిఏ పిడి ఆర్.విజయ రాజు, జడ్పీ సిఇవో యం.శ్రీహరి, నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాఫ్ , సర్వే ఎడి అన్సారీలు అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు నుండి 268 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలిపారు.ప్రజా సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నందున జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువు లోగా త్వరితగతిన, సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖలకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు. జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించి ఫిర్యాదులు పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేసినప్పుడే ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం జరిగి అర్జీదారులు సంతృప్తి చెందుతారని అన్నారు.బుట్టాయిగూడెం మండలం అచ్చియ్యపాలెం చెందిన చోడెం సత్యనారాయణ నాకు ఫ్యామిలీ సర్టిఫికెటు ఇప్పించాలని అర్జీని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

