మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. ఆదర్శం…
1 min read

పి ఐ పి ఆర్ ఎం సి సర్కిల్ ఆఫీస్ లో 164వ జయంతి వేడుకలు కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ భారతరత్న,సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164వ జయంతి వేడుకలు స్థానిక ఎ ఎస్ ఆర్ ఎమ్ స్టేడియం వద్ద గల పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ సర్కిల్ ఆఫీస్ ఏలూరు నందు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన 1861 సెప్టెంబర్ 15న వెంకట లక్ష్మమ్మ, శ్రీనివాస్ శాస్త్రి కి కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా చిక్కబళ్లపూర్ తాలూకాకు చెందిన ముద్దనహళ్లి గ్రామంలో జన్మించారు. ఆయన పని చేసిన చోట్ల ఆత్మవిశ్వాసం, దృఢ అభిప్రాయం, వెన్నుచూపని తత్వం, నిశ్చలంగా పనిచేయడం, ఆందోళన,తొందరపాటు లేని తత్వం,శాస్త్రీయ విధానం, ఆసక్తి, శ్రద్ధ, సామర్థ్యం ఉత్సాహంతో పని చేయాలన్న తత్వంతో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేశారన్నారు. సాంకేతిక, విద్యా,పారిశ్రామిక,పాలన, రచన,రవాణా,ఆర్థిక, సామాజిక, సాంఘిక,ఉత్పత్తి, సేవ,విద్యుత్,వ్యవసాయం, వినోదం,పర్యాటకం, వ్యాపారo,వాణిజ్య మొదలైన ఎన్నో రంగాలలో, ఎన్నో బహుళ ప్రాజెక్టుల నిర్మాణాలలో సేవలు అందించారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎస్ఇ కె.రాజు, డిఈఈ లు పి.నాగమణి, సురేష్ కుమార్, ఏఈఈ లు లలిత,విజయలక్ష్మి, యామిని,శ్రీలక్ష్మి ,వల్లేశ్వరి, షఫీ, ప్రసన్నమణి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

