జిల్లా ఉత్తమ పియిటి లకు ఘన సన్మానం
1 min read

ఇద్దరు ఇద్దరే..!జిల్లాస్థాయిలో ఉత్తములు
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థుల జీవితాలను తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయుడిదే కీలక పాత్ర అని ఎమ్మిగనూరు వాలీబాల్ అసోసియేషన్ సీనియర్ క్రీడాకారులు బాబాఖాన్, విక్రమ్, గోవిందు, శంకర్ లు అన్నారు. పట్టణంలోని సోమవారం ఉదయం వైవిఏ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్ 19 విభాగంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలకు ఎన్నికైన కమ్మరి రాఘవేంద్ర ఆచారి, ప్రకాశం జిల్లాకు ఉత్తమ ఎస్.ఏ పియిటి గా ఎమ్మిగనూరు కు చెందిన ఏ.శ్రీనివాసులు లను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ..జిల్లాలో ఉత్తమ ఉపాద్యాయులుగా ఇద్దరు ఇద్దరే అని కొనియాడారు. విద్యార్థుల లక్ష్యానికి ప్రేరణనిచ్చి, వారి బహుళ ప్రతిభను గుర్తించి సమాజానికి మంచి పౌరులను అందించడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తే ఉత్తమ ఉపాధ్యాయుని లక్షణం అన్నారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు ప్రసాద్, పెద్ధిరన్న, సునిల్, రమేష్, ప్రిన్స్ వహాబ్, గోవిందు, రామకృష్ణనాయుడు, పాలశ్రీనివాసులు, విజయ్, సతీష్, గౌడ్, సూరజ్, అజ్మత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


