NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో 58వ ఇంజనీర్స్ డే కార్యక్రమం

1 min read

భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164 జయంతి వేడుకలు

ఘనంగా నివాళులర్పించిన ఇరిగేషన్ ఎన్జీవోస్,ఇంజనీర్స్ ఫెడరేషన్ సంఘ నాయకులు

ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో ప్రజలఆస్తి,ప్రాణ రక్షణకు ప్రతిపాదనలు చేసిన గొప్ప ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

రాష్ట్ర ఇరిగేషన్ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి  శ్రీనివాస్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు:   ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164 జయంతి ని పురస్కరించుకుని 58 వ ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని రాష్ట్ర ఇరిగేషన్ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మరియు ఇంజనీర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించి విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కొనియడాడుతూ బ్రిటిష్ ప్రభుత్వంలో మైసూర్ సంస్థానంలో దివాన్ గా పనిచేస్తూ ఇంజనీర్ గా ప్రసిద్ధి చెంది కావేరి నది పై కృష్ణ రాజ సాగర్ ని నిర్మించి, నిజాం ప్రభుత్వం లో మూసి నది కి వరదల వచ్చినప్పుడు  హైదరాబాద్ నగరం,మూసి నది పరివాహక ప్రాంతంలో వరద నివారణ చర్యలు. బంగాళాఖాతం వలన  సముద్రంలో రాకాసి అలలు విశాఖపట్నం ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితుల్లో అక్కడ కి వెళ్లి అలలు ఒడ్డు దాటి రాకుండా ప్రజల ప్రాణ రక్షణ.ఆస్తి రక్షణ కి తనకున్న ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో ప్రతిపాదనలు తయారు చేసిన గొప్ప ఇంజినీరని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నీరు,ప్రగతి ఎస్ఈ వెంకటస్వామి. పోలవరం కుడి ప్రధాన కాల్వ డిప్యూటీ ఎస్ఈ  కె.రాజు.డీఈఈ లు పి.గనిరాజు,దేవరకొండ వెంకటేశ్వర్లు.జేఈఈ లు దేవర రాజశేఖర్, మాధవరావు, ఎన్జీవో సంఘ నాయకులు నెరుసు రామారావు,సత్య భారతి.రిటైర్డ్ ఇంజినీర్లు రేవు సతీశ్ కుమార్,ముక్కామల కృష్ణా రావు.వై.శ్రీరామమూర్తి  తదితరులు.పాల్గొన్నారు.

About Author