మహిళల ఆరోగ్య పరిరక్షణతో కుటుంబాల బలోపేతం సాధ్యమవుతుంది
1 min read

ఇంచార్జి కలెక్టర్ డా. బి.నవ్య
కర్నూలు, న్యూస్ నేడు: మహిళల ఆరోగ్య పరిరక్షణతో కుటుంబాల బలోపేతం సాధ్యమవుతుందని ఇంచార్జి కలెక్టర్ డా. బి.నవ్య పేర్కొన్నారు.బుధవారం స్థానిక ఏ క్యాంప్ లో ఉన్నటువంటి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ మాసోత్సవాలు, 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాలను నిర్వహించారు.. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు… అదే విధంగా 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాలను కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. స్త్రీ ఆరోగ్యంగా ఉండడం ఎంత ముఖ్యమైనదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలను క్యాంపెయిన్ మోడ్ లో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం ద్వారా తెలియజేస్తున్నారన్నారు.అనంతరం ఇంచార్జి కలెక్టర్ గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్న పిల్లలకి అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించారు.. అక్కడే ఏర్పాటు చేసిన అంగన్వాడి స్టాల్ ను పరిశీలించారు.. స్క్రీనింగ్ పరీక్షలకు సంబంధించిన వాటిని బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలను ఇంచార్జి కలెక్టర్ ప్రారంభించారు.కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారులు రామనాథం, డా.నరేష్,ఐసిడిఎస్ పిడి విజయ, డి ఎం హెచ్ ఓ డా. శాంతి కళా, డి సి హెచ్ ఎస్ డా.జాఫ్రుల్లా, డి ఐ ఓ డా.నాగప్రసాద్, కార్పొరేటర్ పద్మలత, తదితరులు పాల్గొన్నారు.


