రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బాలికలు ఎన్నిక..
1 min read

హొళగుంద న్యూస్ నేడు : కర్నూలు జిల్లాలోని బాలికలు బాలురుకు ఆంధ్ర కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల కోసిగి మండలంలో సెలక్షన్స్ జరిగాయి బాలికల జూనియర్ విభాగమునందు 60 మంది బాలికలు రాగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలహొళగుంద నుండి రాష్ట్రస్థాయి విభాగమునకు భూమిక, ఐశ్వర్య, అనురాధ, గాయత్రి, బాలికలు నలుగురు ఎన్నిక కావడం అయినది వీరు రాష్ట్రస్థాయి పోటీలు సెప్టెంబర్ 25 నుండి 28 వరకు కడప జిల్లా గోళ్ళ పూడి నందు జరిగే కబడ్డీ ఆటల పోటీలలో పాల్గొంటారు వీరు రాష్ట్రస్థాయి ఆటల పోటీలలో పాల్గొని పాఠశాలకు మంచి పేరు తేవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కబీర్ సాబ్, వ్యాయామ ఉపాధ్యాయుడు పెద్ద మహబూబ్ భాష విద్యార్థులను అభినందించడం మైనది ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శాంతమూర్తి మరియు ఉపాధ్యాయులు విద్యార్థులలో అభినందించడం జరిగింది.

