మహిళా కిక్ బాక్సర్లు ప్రతిభ కనబరచాలి
1 min read

సీనియర్ గైనకాలజిస్ట్ డా. శ్వేతా రెడ్డి
- 21న కేలో ఇండియా మహిళల కిక్ బాక్సింగ్ పోటీలు
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు: రాష్ట్రంలో మహిళా కిక్ బాక్సర్లు బాక్సింగ్ క్రీడలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు సీనియర్ గైనకాలజిస్ట్ డా. శ్వేతా రెడ్డి. గురువారం నగరంలోని డాక్టర్ త్రినాథ్ అకాడమీ చైర్మన్ డా. త్రినాథ్ నేతృత్వంలో కేలో ఇండియా మహిళా కిక్ బాక్సింగ్ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా డా. శ్వేతా రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కేలో ఇండియా మహిళా కిక్ బాక్సింగ్ లో మహిళలు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్న డా. శ్వేతా రెడ్డి… కిక్ బాక్సింగ్ లోనూ సత్తా చాటాలన్నారు. క్రీడల్లో మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అనంతరం డా. త్రినాథ్ అకాడమీ చైర్మన్ డా. త్రినాథ్ మాట్లాడుతూ ఈ నెల 21న జరిగే మహిళా కిక్ బాక్సింగ్ పోటీలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ స్టేట్ సెక్రటరి నరేంద్ర ఆచారి, కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.

