NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళా కిక్​ బాక్సర్లు ప్రతిభ కనబరచాలి

1 min read

సీనియర్​ గైనకాలజిస్ట్​ డా. శ్వేతా రెడ్డి

  • 21న కేలో ఇండియా మహిళల కిక్​ బాక్సింగ్​ పోటీలు

కర్నూలు హాస్పిటల్​ , న్యూస్​ నేడు:  రాష్ట్రంలో మహిళా కిక్​ బాక్సర్లు బాక్సింగ్​ క్రీడలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు సీనియర్​ గైనకాలజిస్ట్​ డా. శ్వేతా రెడ్డి. గురువారం నగరంలోని డాక్టర్​ త్రినాథ్​ అకాడమీ చైర్మన్​ డా. త్రినాథ్​ నేతృత్వంలో  కేలో ఇండియా మహిళా కిక్​ బాక్సింగ్​ పోటీలకు సంబంధించిన వాల్​ పోస్టర్లను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా డా. శ్వేతా రెడ్డి మాట్లాడుతూ   కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కేలో ఇండియా మహిళా కిక్​ బాక్సింగ్​ లో మహిళలు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్న డా. శ్వేతా రెడ్డి… కిక్​ బాక్సింగ్​ లోనూ సత్తా చాటాలన్నారు. క్రీడల్లో మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.  అనంతరం డా. త్రినాథ్​ అకాడమీ చైర్మన్​ డా. త్రినాథ్​ మాట్లాడుతూ ఈ నెల 21న జరిగే మహిళా కిక్​ బాక్సింగ్​ పోటీలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కిక్​ బాక్సింగ్​  స్టేట్​ సెక్రటరి నరేంద్ర ఆచారి, కోచ్​ లు తదితరులు పాల్గొన్నారు.

About Author