NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాటరీ ప్రక్రియ ద్వారా  ఓపెన్ కేటగిరి లో  బార్ల కేటాయింపు

1 min read

లాటరీ తీసి బార్ల కేటాయింపు చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :2025-28 సంవత్సర కాలానికి ఓపెన్ కేటగిరి లో  మద్యం బార్లకు గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి లాటరీ తీశారు. ఏలూరు జిల్లా నందు నూతన బార్ పాలసీ 2025-28 భాగంగా ప్రభుత్వం వారు మొదటి  నోటిఫికేషన్ లో మిగిలిన (09) ఓపెన్ కేటగిరి బార్లు కు ది. 03.09.2025 న ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన (08) అప్లికేషన్ లకు గాను 4 లేదా అంతకు ఫైన వచ్చిన అప్లికేషన్స్ బార్లకు అనగా (02) ఓపెన్ కేటగిరి బార్లు కు  కలెక్టర్ లాటరీ ద్వారా బార్లను కేటాయించారు.ఈ లాటరీ ద్వారా ప్రభుత్వం వారికి 59.13 లక్షల ఆదాయం సమకూరినది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, జిల్లా మధ్య నిషేధ మరియు అబార్కిఅధికారి ఏ. ఆవులయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు జి.పాండు రంగారావు మరియు  అజయ్ కుమార్ సింగ్,ఏలూరు ఎక్సైజ్ సీఐలు   బార్లకు దరఖాస్తు చేసిన 6 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

About Author