ప్రపంచంలో మొదటిసారి100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
1 min read

హైదరాబాద్, న్యూస్ నేడు: స్టార్టప్‌లు, స్కేల్‌అప్‌లు తమ కథలను ప్రపంచానికి చెప్పేందుకు ఈ వేదికను వినియోగించుకోండి – మంత్రి శ్రీధర్ బాబు పిలుపుహైదరాబాద్‌లో జరుగనున్న ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి 100కిపైగా ఐటీ బీట్ జర్నలిస్టులు పాల్గొననున్నారుహైదరాబాద్, సెప్టెంబర్ 19, 2025: తెలంగాణ ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల కలిసి ‘పిచ్2ప్రెస్’ పోస్టర్‌ను ఇవాళ విడుదల చేశారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 27, 2025న హైదరాబాదులోని ట్రైడెంట్ హోటల్‌లో జరుగనుంది. ప్రపంచంలోనే తొలిసారిగా జర్నలిస్టుల ముందు నేరుగా ఇన్నోవేటర్లు తమ అనుభవాలను చెప్పుకునే అవకాశం ఇది.ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటిఐటిసి) అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ,* “పిచ్2ప్రెస్ అనేది ఒక ఈవెంట్ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం. ఇన్నోవేషన్‌కు గొంతుక ఇవ్వడం, మంచి అనుభవాల ద్వారా వ్యాపారాన్ని వేగంగా ఎదిగించడమే మా లక్ష్యం. ఒక సారీ జర్నలిస్టులకు మీ అనుభవం నచ్చితే, అది మొత్తం దేశం దృష్టిని ఆకర్షించగలదు. జర్నలిస్టులు, ఇన్నోవేటర్లు ఇద్దరూ తప్పక ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవాలి” అన్నారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిజిథాన్ బృంద సభ్యులు భాగ్యలక్ష్మి వాకిటి, హేమా మారం, దీపిక జోషి, తేజస్విని, నితిన్య హర్కరా మరియు ప్రకాష్ పాల్గొన్నారు.ఈవెంట్‌లో పాల్గొనాలనుకునే స్టార్టప్‌లు/ఇన్నోవేటర్లుtinyurl.com/pitch2press ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చులేదా +91 80190 77575 నంబర్‌ను సంప్రదించవచ్చు.

