NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్”లో ఏలూరు జిల్లా పోలీసుల శ్రమదానం

1 min read

పచ్చదనం,పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ మన లక్ష్యం

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క పిలుపు మేరకు ప్రతి మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛ దివస్ లో భాగంగా,ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్,ఐపీఎస్  ఆదేశాలపై ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పెరేడ్ గ్రౌండ్,కార్యాలయం చుట్టుప్రక్కల మరియు పోలీస్ సిబ్బంది నివాసా ప్రాంతాలలో  ఏఆర్ డీఎస్పీ చంద్ర శేఖర్, ఆర్.ఐ పవన్ కుమార్,  ఆర్ఎస్ఐ భాస్కర రావు,  ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది శ్రమదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధికార్లు సిబ్బంది పాల్గొని తమ కార్యాలయాలు పోలీస్ స్టేషన్ ప్రాంగణా పరిసర ప్రాంతలు పరిశుభ్రం చేసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,మన పరిసరాల నివాస,పని చేసే ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో సిబ్బంది ఆరోగ్యానికి,కుటుంబం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.ప్రజల్లో శుభ్రత పై అవగాహన పెంచే ఉద్దేశంతో సీజనల్ గా వచ్చే డేంగి మలేరియా ఇతర వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేలాగా వ్యర్థాలు తొలగించి, పచ్చదనాన్ని పరిశుభ్రతను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా తీసుకుని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఏలూరు జిల్లా పోలీసు అధికారులు తెలియచేశారు.

About Author