NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పెన్ డౌన్ కార్యక్రమం

1 min read

ప్రభుత్వం అమలు చేసిన ఓటిపి పద్ధతి రద్దు చేయాలి

పాత విధానములో ఒక గంట గ్రాండ్ ఇచ్చి కొనసాగించాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఏలూరు జిల్లా ప్రధాన సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు రెండు రోజులు పాటు పెన్ డౌన్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్మించిన ఓటీపీ పద్ధతి ద్వారా కక్షిదారులు అనేక ఇబ్బందులు పడవలసి వస్తుందన్న కారణముగా  దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు పెన్ డౌన్ చేయుటకు నిర్ణయించుకున్న మనీ తెలిపారు. మాకు ఈ క్రింది సమస్యలు కలవు. దస్తావేజు రిజిష్ట్రీ చేసినప్పుడు కక్షిదారుల పేర్లు నమోదుకు పి.డి.ఇ (పబ్లిక్ డేటా ఎంట్రీ) చేయునప్పుడు ఒ.టి.పి (ఒన్ టైమ్ పాస్వార్డు) అడుగుచున్నది. దానికి కక్షిదారులు ఇబ్బంది పడుచున్నారు. ప్రభుత్వం ఎవరికీ ఆధార్ కార్డు నెంబర్లు గానీ, ఒ.టి.పిలు గానీ చెప్పవద్దని (బ్యాంక్లు, పోలీసులు,రెవిన్యూ వార్లు) తెలియజేయున్నారు. కావున ఓ.టి.పి పద్దతి రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము.సదరు దస్తావేజు పి.డి.ఇ(పబ్లిక్ డేటా ఎంట్రీ) చేయునప్పుడు తప్పులు జరిగినయెడల డి.ఆర్ (జిల్లా రిజిస్ట్రార్) ఉత్తర్వులతో ఎడిట్ ఇండెక్స్ చేసేవారు ఇప్పుడు ఆ ఆప్షన్ తీసివేసినారు. సదరు ఎడిట్ ఇండెక్స్ ఆప్షన్ను పునరుద్ధరించవలసిందిగా కోరుచున్న మన్నరు.కక్షిదారులు అనారోగ్యమునకు గురైనప్పుడు రిజిస్ట్రీ ఆఫీసుకు వచ్చి రిజిస్ట్రీ చేయుటకు రాలేకపోయిన కారణములో సదరు దస్తావేజు రిజిష్ట్రీ చేయుటకు ప్రైయివేటు అటిడెండ్స్ ఉండేది.(సబ్ రిజిస్ట్రారు కక్షిదారు ఇంటికి వచ్చి రిజిస్ట్రీ చేసేవారు) సదరు ప్రైయివేటు అటిడెండ్స్ పునరుద్దరించవలసిందిగా కోరారు.గతంలో ఏ దస్తావేజు అయినా,ఏ ప్రాంత సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో అయినా ఒక గంటలో గ్రాంట్ తీసుకొని రిజిస్ట్రీ చేసుకునే సదుపాయం ఉండేది. దానిని ఇప్పుడు 48 గంటలకు గ్రాంట్ ఇస్తున్నారు. దాని వలను కక్షిదారులు రెండు రోజుల పాటు ఇబ్బంది పడుతున్నారన్నారు. దానిని పాత విధానంలో ఒక గంటలో గ్రాంట్ ఇచ్చి కొనసాగించే విధంగా చేయాలన్నారు.పై ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘం పిలుపు మేరకు  పెన్ డౌన్  నిర్వహించుచున్నాము. సదరు విషయము అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నామని తెలిపారు. పెన్లెన్ కార్యక్రమానికి మాతోపాటు మీరు కూడా సహకరించవలసిందిగా కోరుచున్నామని విజ్ఞాపించారు. మా సమస్యలపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొచ్చి తగు పరిష్కారము చూపించవలసిందిగా కోరుచున్నామన్నరు.

About Author