సాగులో డ్రోన్లు, యాంత్రీకరణ ద్వారా రైతులకు లాభసాటి వ్యవసాయం
1 min read

వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు రైతులకు సబ్సిడీతో అధునాతన వ్యవసాయ పరికరాలు సద్వినియోగం చేసుకోవాలి
లింగపాలెం లో డ్రోన్లు ద్వారా నానో యూరియా స్ప్రే విధానంను రైతులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : లింగపాలెం మండలం లింగపాలెం-కళ్యాణపాడు వరిపొలాలకు శనివారం డ్రోన్లు ద్వారా వరి పొలాలకు నానో యూరియా స్ప్రే చేస్తున్న కార్యక్రమాన్ని స్థానిక రైతులతో కలసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు సబ్సిడీతో ఇస్తున్నదని,ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవం డ్రోన్లు ద్వారా ఎరువులు,పురుగు మందులు ఒక్క ఎకరం పొలానికి పిచికారీ కేవలం 5 నిమిషాల్లోనే పూర్తి అవుతుందన్నారు.దీంతో రైతులకు సమయం,డబ్బు ఆదా అవుతుతోందన్నారు. రైతులకు వరంగా మారిన కిసాన్ డ్రోన్లు రైతులు విరివిగా ఉపయోగించుకోవాలని అన్నారు.యూరియా ద్రావణం, సూక్ష్మ పోషకాలు వంటి ద్రావణ ఎరువులను పిచికారీ చేయడం వల్ల సమర్థత పెరిగి, ఎరువులు ఖర్చు తగ్గి రైతులకు డబ్బు,సమయం అదా అవుతుందని అన్నారు. వ్యవసాయానికి డ్రోన్లు చాలా ఉపయోగకరం అని, పర్యావరణంపై రసాయన ప్రభావం తగ్గుతుందని తెలిపారు.కొండ ప్రాంతాలు, బురద ప్రాంతాలు, నీరు నిలిచిన పొలాల్లో సులభతరంగా పిచికారీ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ భాషా, జిల్లా పంచాయతీ అధికారి కె.అనురాధ,డియల్డివో పి.వెంకటరత్నం,తహశీల్దారు యండి.నజీముల్లాషా, యంపిడివో కె.వాణీ, చింతలపూడి ఏడీఎ సుబ్బారావు, మండల అధికారులు,గ్రామ రైతులు,తదితరులు పాల్గొన్నారు.


