NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

33,34 డివిజన్ లలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద కార్యక్రమం

1 min read

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

ఉత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురు సానిటరీ సిబ్బందికి 5,000 చొప్పున ప్రోత్సాహం

కృష్ణ కాలువ వెంబడి మొక్కలు నాటిన ఎమ్మెల్యే, మేయర్,కమిషనర్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :  పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి భాద్యత అని  ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. స్వచ్ఛత కోసం కేవలం ప్రతిజ్ఞ చేస్తే సరిపోదనీ, ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, అప్పుడే పరిశుభ్రత సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు. ఏలూరులో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబుతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన కృష్ణా కాల్వ గట్టు పై మొక్కలు నాటి అనంతరం పరిసరాల పరిశుభ్రతపై మహిళలకు అవగాహన కల్పించారు. ఏలూరు 33-34వ డివిజన్ల పరిధిలో శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.మేయర్‌ నూర్జహాన్‌ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహనను పెంపొందించుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌,  కమిషనర్‌ ఎ. భానుప్రతాప్‌, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, డివిజన్ ఇంచార్జ్ పిల్లారి శెట్టి సంధ్యా సురేష్, క్లస్టర్ ఇంచార్జ్ నాగేశ్వరరావు, కో- క్లస్టర్ ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు,మాజీ ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, కార్పొరేషన్‌ అధికారులు, మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి  నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author