NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రవీంద్ర ’ లో ఘనంగా దసరా ఉత్సవం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:         నగరంలోని అబ్బాస్ నగర్ లోని రవీంద్ర పాఠశాలలో విజయదశమి పర్వదినాన్ని వివిధ పూలతో, రంగురంగుల అలంకరణలతో కళకళలాడగా, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్, వైస్ చైర్మన్ జి.వంశీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి.పుల్లయ్య  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన పండుగలు మన ప్రాచీన సాంప్రదాయాలను గుర్తుచేస్తాయని, ప్రతి పండుగకు పురాణ చరిత్ర తప్పక ఉంటుందన్నారు. దసరా ఉత్సవం మనలోని చెడు అలవాట్లను తొలగించి, సత్ప్రవర్తనకు మార్గం చూపే విజయాల దశమి మన విజయదశమి అని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఉత్సవం ప్రత్యేకతను ప్రతిబింబించేలా చేశాయి ఈ కార్యక్రమంలో పాఠశాల సమన్వయకర్తలు శ్రీమతి సౌమ్య, జ్యోతిర్మయి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు.

About Author