NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“క్యాన్సర్ బర్డెన్ పెరుగుతోంది మహిళలు కాన్సర్ పై అవగాహన పెంచుకోండి”

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  క్యాన్సర్ బర్డెన్ రాబోయే కాలంలో దేశంలో అధికమవుతుందని ప్రతి మహిళ క్యాన్సర్ గురించి అవగాహన కలిగి ఉండడం అవసరమని అందువల్లే   మన దేశ గౌరవ ప్రధాని శ్రీ మోడీ గారు మహిళల కోసం ప్రత్యేకంగా “స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమం  చేపట్టారని  ఇందులో మహిళలని అన్ని రంగాల్లో చైతన్య పరచడం వ్యాధుల పట్ల అవగాహన, కలిగించడం  లాంటి కార్యక్రమాలు పొందుపరచారని  అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కర్నూల్ మెడికల్ కాలేజీ  ప్రిన్సిపల్  డా. కె. చిట్టి నరసమ్మ అన్నారు. శనివారం స్టేట్ కాన్సర్ ఇన్స్టిట్యూట్  యందు “స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమం లో బాగంగా  మహిళలకు” కాన్సర్ గురించి అవగాహన కార్యక్రమం” ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో లో ఆమె మాట్లాడుతూ ప్రజల జీవనశైలి మారిందని తీసుకునే ఆహార ఆహార పదార్థాలు హానికర కారకాలతో కూడి వుంటున్నాయని అందువల్ల  వివిధ రకాల కాన్సర్ లు వస్తున్నాయని తెలిపారు. కుటుంబము లో మహిళల  ఆహారం ప్రదార్థాల విషయం లో అవగాహన పెంచు కోవాలని అదేవిధంగా ఆరోగ్యం విషయంలో చిన్నపాటి తేడాల కనిపించిన వెంటనే వైద్యల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైదులకు, నర్సింగ్ సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి శ్యామల సి ఎస్ ఆర్ ఎమ్ ఓ డాక్టర్ హేమనళిని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author