‘ కిక్ ’ కొట్టారు.. పతకం పట్టారు..
1 min read

‘ ఖేలో ఇండియా’ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలికలు
- వివిధ పోటీలో 200 మంది క్రీడాకారులు బరిలోకి..
- కర్నూలు ప్రతిష్టను పెంచిన త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ
- విజేతలకు బహుమతులు అందజేసిన డా. త్రినాథ్
కర్నూలు స్పోర్ట్స్ , న్యూస్ నేడు: ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీలో క్రీడాకారిణులు అత్యుత్తమ ప్రతిభ కనబరచారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 200 మంది క్రీడాకారిణులు బరిలో దిగారు. కర్నూలు నగరం డాక్టర్స్ కాలనీలోని త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ లో శుక్రవారం జరిగిన వివిధ పోటీలలో బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కార్యక్రమానికి త్రినాథ్ అకాడమీ చైర్మన్, అమ్మ హాస్పిటల్ అధినేత డా. త్రినాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. పోటీల అనంతరం డా. త్రినాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియాలో భాగమైన కిక్ బాక్సింగ్ పోటీలో బాలికలు విశేష ప్రతిభ కనబరిచారన్నారు. ఇక్కడ గెలుపొందిన విజేతలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చూపి పతకాలు సాధించాలని ఈ సందర్భంగా డా. త్రినాథ్ ఆకాంక్షించారు. కర్నూలులోని త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీలో ఖేలో ఇండియా పోటీలు జరగడం సంతోషంగా ఉందని, ఇది కర్నూలు ప్రతిష్టను పెంచిందన్నారు. కార్యక్రమంలో కేవి సుబ్బారెడ్డి, రాష్ట్ర కిక్ బాక్సింగ్ కార్యదర్శి నరేంద్ర ఆచారి , ప్రిన్సిపల్స్ రామచంద్రుడు, రాఘవేంద్ర సార్, వెంకటేశ్వర్లు సార్, కోచస్ హరి అశోక్, రిఫరెన్స్ మహేష్, కళ్యాణ్,హరిబాబు, జయ కళ్యాణ్ పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



