ఆదోని ని కనకదాసు జిల్లా గా నామకరణం చేయాలి
1 min read

కర్నూలు జిల్లా కురువ సంఘం
కర్నూలు , న్యూస్ నేడు: కర్నూలులో శుక్రవారం నగరం లోని సంఘం కార్యాలయం లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు, కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న మాట్లాడుతూ ఆదోని జిల్లా చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి ఆ జిల్లాను శ్రీ భక్త కనకదాసు పేరు మీదగా కనకదాసు జిల్లాగా గవర్నమెంట్ తీర్మానం చేయాలని కురువ సంఘం కోరింది ఈ తీర్మానాన్ని మంత్రులకు అలాగే దానికి సంబంధించిన విభజన కమిటీ సభ్యులకు,సీఎం చంద్రబాబు నాయుడు కి మరియు మంత్రి లోకేష్ బాబుకి జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు అదోని ఎమ్మెల్యే పార్థసారథి కి ఆదోని ఇంచార్జీ మీనాక్షి నాయుడు కి అందజేస్తామని తెలిపారు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి మాట్లాడుతూ ఇంకా మా కులానికి రావలసిన నామినేటెడ్ పదవుల్లో లో కురువ కులానికి చాలా అన్యాయం జరిగిందని తెలిపారు.అలాగే రాబోయే స్థానిక సంస్థల్లో అందరు ఐక్యంగా ఉండి పార్టీలకు అతీతంగా మన అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్రీలీలమ్మ ప్రదానకార్యదర్శి అనిత జిల్లా ఉపాధ్యక్షులుబి. వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయ, కత్తి శంకర్, కె. టీ. ఉరుకుందు,జిల్లా సహాయ కార్యదర్శులు కె దేవేంద్ర, బూదురు లక్ష్మన్న, జిల్లా కోశాధికారి కె. సి. నాగన్న, జిల్లా నాయకులు బి. సి. తిరుపాల్, పెద్దపాడు పుల్లన్న, నగర సంఘం అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బి. రామకృష్ణ, కె. వెంకటేశ్వర్లు, దివాకర్, మద్దిలేటి, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.


