NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు చెల్లించండి.. ఆపస్

1 min read

విజయవాడ , న్యూస్​ నేడు:   కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగులకు సంబంధించి పది శాతం కాంట్రిబ్యూషన్ వారి అకౌంట్లో జమ చేసినప్పటికీ, కరువు భత్యం (డి ఏ) చెల్లించినప్పుడల్లా వాటి అరియర్స్ కు సంబంధించిన 90 శాతం నగదును సిపిఎస్ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, అలాగే పిఆర్సి అరియర్స్ కు సంబంధించి 90 శాతం నగదును కూడా వారి ఖాతాలో జమ చేయాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను వారి వ్యక్తిగత ఖాతాలకు జమ చేయాలని, ఈ విషయమై ఇప్పటికే ఉద్యోగులు కోర్టు మెట్లు ఎక్కారని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి దసరా కానుకగానైనా సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ( ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు శవన్నగారి బాలాజీ, ప్రధాన కార్యదర్శి జి వి సత్యనారాయణ ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.    నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బకాయి పడ్డ నాలుగు డి ఏ లను ఇంతవరకు చెల్లించలేదని, పిఆర్సి ఊసే ఎత్తడం లేదని,అయితే ఉద్యోగులకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్, ఏపీ జి ఎల్ ఐ, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సరెండర్ లీవు బిల్లులు కొంత కొంత గా చెల్లిస్తూ ఉన్నప్పటికీ, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి వారికి రావాల్సిన బకాయిలను పట్టించుకోవడంలేదని, వెంటనే స్పందించి వారి బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

About Author