NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనాధ వృద్ధురాలు మృతి…

1 min read

అంత్యక్రియలు నిర్వహించిన పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ తెలుగుదేశం పార్టీ నాయకులు మానవతావాదులు

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో అనాధ వృద్ధురాలు ఎరుకల నాగమ్మ 70 సం” చనిపోగా అంత్యక్రియలు నిర్వహించిన వేంకోబులు సామాజిక సేవా కార్యకర్త,కదిరికోట షాలేమ్ తెలుగుదేశం పార్టీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్,ఎరుకల శ్రీనివాసులు 6 వార్డు ఇంచార్జ్,పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు సింగనేటి నరసన్న పూలమాలలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. ఎరుకల నాగమ్మ ఎమ్మిగనూరు టౌన్ శాంతినగర్ లో నివాసం ఉంటూ తన భర్త సత్యనారాయణ చనిపోయిన తర్వాత  ఒంటరిగా జీవిస్తూ నడవలేని స్థితిలో అనారోగ్యం తో వృద్ధాప్య కారణం చేత తననుచుకునే వాళ్ళు ఎవరు లేక రోడ్ల పైన వీధులలో బస్టాండ్ లలో నిద్రిస్తూ నిన్న రాత్రి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణంలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసి  అక్కడున్న వాళ్ళు ప్రభుత్వ ఆస్పటల్ డాక్టర్లకు సమాచారం అందించగా చనిపోయిందని నిర్ధారించారు. వారు ఎమ్మిగనూరు టౌన్ సిఐ కి సమాచారం అందించగా వృద్ధురాలు యొక్క సమాచారాన్ని సేకరించి తనకు ఎవరు లేరని తెలుసుకొని కేసు ఎఫ్ ఐ ఆర్ చేసి పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి సమాచారం అందించగా ఎమ్మిగనూరు టౌన్ అధ్యక్షులు మల్లెపోగు అబ్రహాము  టౌన్ ఉపాధ్యక్షులు షేక్షావలి తదితరులు మట్టి వేసి పూలమాలతో కుర్ణీ స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబంలో చిన్న చిన్న కారణాలతో వృద్ధులకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి సేవ చేయలేక కన్న బిడ్డలే బంధువులే ఇలాంటి వారిని నిర్లక్ష్యంతో బయటికి గెంటేస్తున్నారు అనారోగ్యంతో ఉన్న వారిని పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చేరదీసి ఆహారం అందించి వైద్యం అందించిన కోలుకోలేక 20 మంది అనాధలు చనిపోగ అంత్యక్రియలు చేయడం జరిగింది ఇలాంటి వారిని చూసుకోవడానికి మదర్ తెరిసా అమ్మానాన్న వృద్ధాశ్రమం నిర్మానం చేస్తున్నాం సహాయ సహకారాలుఅందించాలని కోరుచున్నాము.

About Author