NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న ఎంఈఓ 1 ను సస్పెండ్ చేయాలి

1 min read

ఎమ్మిగనూరు ప్రైవేట్ పాఠశాలలపై మరియు నవోదయ కోచింగ్ సెంటర్ల పై  విచారణ జరిగి నెల రోజులు గడుస్తున్న పట్టించుకోని జిల్లా విద్యా శాఖ అధికారులు

వారం రోజుల లోగా సరైన అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయకపోతే కర్నూల్ డీఈవో ఆఫీస్ ను ముట్టడిస్తాం….

 విద్యార్థి సంఘాల డిమాండ్

ఎమ్మిగనూరు న్యూస్ నేడు ఎమ్మిగనూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలపై మరియు నవోదయ కోచింగ్ సెంటర్ల పై విచారణ జరిగి నెలలు గడుస్తున్న జిల్లా విద్యాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై  విద్యార్థి సంఘ నాయకులు ఉదయ్ శేఖర్ ఆఫ్రిది కాజా రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో సరైన అనుమతులులేని ప్రైవేట్ పాఠశాలల ను సీజ్ చేయాలని  12-09-2025 తేదీన విద్యశాఖ కమిషనర్ విజయరామరాజు ఐఏఎస్ కి ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా  16-09-2025 తేదీన కర్నూల్ డిఇఓ అయినటువంటి శామ్యూల్ పాల్ కి కూడా ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది కావున విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూర్ ప్రైవేట్ పాఠశాలలపై మరియు ఎమ్మిగనూరు నవోదయ కోచింగ్ సెంటర్లపై19-09-2025 తేదీన డిఇఓ తాను వేసినటువంటి కమిటీ బృందాలతో వివిధ పాఠశాలల పైన వివిధ నవోదయ కోచింగ్ సెంటర్ల పైన విచారణ జరిపించడం జరిగింది విచారణ జరిగి వారాలు గడుస్తున్న డీఈవో పట్టించుకోవడంలేదని పి జి ఆర్ ఎస్ లో కలెక్టర్ సిరి కి ఫిర్యాదు చేయడం జరిగింది ఆమె స్పందించి సరైన అనుమతులు లేని పాఠశాలలను సిజ్ చేయమని నవోదయ కోచింగ్ సెంటర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని ఆదేశించిన కూడా డీఈవో శామ్యూల్ పాల్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ వాటికి కనీసం  నోటీసులు కూడా పంపించకపోవడం పరిస్థితి అని ప్రైవేటు పాఠశాలలకు వత్తాసు పలికే విధంగా ఉంది అని వారు అన్నారు  సరైన అనుమతులు లేకుండా వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ జీవో నెంబర్ ఎంఎస్ 1, జీవో 77 ను పాటించమని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్న వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై అధికారులు అమ్ముడుపోయారా ఆరోపణలు చేశారు దీనిపైన విద్యాశాఖ అధికారులు స్పందించి వారం రోజుల లోగా ప్రైవేటు పాఠశాలలను మరియు నవోదయ కోచింగ్ సెంటర్లను  సీజ్  చేయాలని వారు డిమాండ్ చేశారు వారం రోజుల లోగా కోచింగ్ సెంటర్లు గానీ ప్రైవేట్ పాఠశాలలు గాని సిజ్ చెయ్యకపోతే డీఈఓ ఆఫీసును ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

About Author