NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నల్ల బ్యాడ్జీలు ధరించి డాక్టర్ల నిరసన..

1 min read

వైద్యులకు పదోన్నతులు కల్పించాలి..

మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్ నేడు  : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు సమ్మె బాట పట్టారు.ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్ సీ డాక్టర్లు అత్యవసర సేవలు మినహా సాధారణ ఓపి సేవలను ఆపివేశారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు రాజు,వ్యోమ కేష్ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆస్పత్రి ఎదుట నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ దీర్గ కాలిక సమస్యలు మరియు గత సంవత్సరం ఉన్నతాధికారులు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని వాటికి విరుద్ధంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆన్ లైన్ సేవలను ఆపివేసినట్లు వాట్సాప్ గ్రూపులో నుండి తొలగినట్లు తెలిపారు.గత 25 సం.ల నుండి పదోన్నతులు లేక ఒకే హోదాలో పెద్ద సేవలు అందిస్తున్నామని వైద్యులకు పదోన్నతులు కల్పించాలి.ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలి.చంద్రన్న సంచార చికిత్సకు 5 వేలు భత్యం ఇవ్వాలని తదితర వాటి డిమాండ్ల సాధన కోసం ముందుకెళ్తున్నామని డాక్టర్లు తెలిపారు.జిల్లా మరియు అమరావతిలో ఏఏ కార్యక్రమాలు చేయుట గురించి రాష్ట్ర కమిటీ సమ్మెను ఉధృతం చేస్తుందని వారు అన్నారు.ప్రభుత్వం వైద్యుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

About Author