న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా, జి. కబర్థి, అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు వారి సూచనల మేరకు బి. లీలా వెంకట శేషాద్రి, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు వారు కల్లూరు ముజాఫర్ నగర్ నందు గల కమిటీ భవన్ నందు నల్సా పథకములపై ” న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంపు” నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకృత్యాలు, బాల్యవివాహాలు, దళిత గిరిజనులపై అత్యాచారాలు, కుల దూషనలు, దాడులను అరికట్టాలంటే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. బుడగ జంగాల ప్రజలు వారి పిల్లలకు బాల్య వివాహలు జరప కుండా చూడాలని కోరారు. బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులపై, ప్రోత్సాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. నల్సా( గిరిజన హక్కుల రక్షణ మరియు అమలు) పథకం, 2015,నల్సా (సంవాద్-అట్టడుగు వర్గాలకు చెందిన, బలహీన వర్గాలకు చెందిన సంచార తెగలకు, బుడగ జంగాల వారికీ న్యాయం పొందే అవకాశాన్ని బలోపేతం చేయడం)పధకం, 2025, నల్సా (ఆశా-పిల్లల కోసం పిల్లల-స్నేహపూర్వక చట్టపరమైన సేవలు-బాల్య వివాహలను నిర్మూలించడం-2025 , నల్సా (జాగృతి – గ్రాస్ రూట్స్ సమాచారం మరియు పారదర్శకత చొరవ కోసం న్యాయం అవగాహన) పథకం 2025 లను వివరించారు.ఉచిత న్యాయ సహాయము, విద్యాహక్కు, 1098 హెల్ప్ లైన్, మహిళా హెల్ప్ లైన్ నంబర్ 181, న్యాయ సహాయం కోసం హెల్ప్‌లైన్ – 15100, చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, దివ్యాంగజన్ హెల్ప్ లైన్ నెంబర్ 14456 మొదలు అంశాలను తెలియజేశారు. అనంతరం బాల్య వివాహ నిరోధక చట్టం పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో శిక్షణ పొందుతూన్న జ్యుడీషియల్ ఆఫీసర్లైన కే. హేమ,ఎస్. లక్ష్మి, జి.అపర్ణ,పి. హేమ, కర్నూలు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొండయ్య, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డీ సి పి ఓ శారద, కర్నూల్ సిడిపిఓ అనురాధ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుభేద బేగం, లీగల్ సర్వీసెస్ యూనిట్ నెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, కల్లూరు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జుబేదాబి, బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీవో అధ్యక్షురాలు మౌనిక, ఆశ వర్కర్లు అంగన్వాడి వర్కర్లు బుడగ జంగాల ప్రజలు సచివాలయం పోలీసులు, మెప్మా కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు.

