బాబు షూరిటీ మోసం గ్యారంటీ విస్తృత స్థాయి సమావేశం
1 min read

గ్రామ అనుబంధ కమిటీలు ఏర్పాటు
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక , పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠల ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప,కౌన్సిలర్ బోయ బజారి ల అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ విస్తృతస్థాయి సమావేశము మరియు గ్రామ అనుబంధ కమిటీలు నిర్వహించడం జరిగింది. శ్రీమతి బుట్టా రేణుక మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అరకొరగా అమలు చేస్తున్న పథకాల్లో అన్ని కోతలే ఉన్నాయని, బాబుకు చిత్తశుద్ధి ఉంటే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చిన హామీలన్నీ నిజంగా నేరవెర్చేవారని,ఇంటింటికీ వెళ్లి చంద్ర బాబు మోసాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16నెలలు అయ్యిందని, సూపర్ సిక్స్ పథకాలను అరకొరగా అమలు చేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. చంద్రబాబుది సుపరిపాలన కాదని.. మోసాల పాలన అని ఎద్దేవ చేశారు. పింఛన్లలో కోతలు వీధించి దివ్యాంగులకు అన్యాయం చేశారన్నారు. ఇప్పటి వరకు కొత్త పింఛన్ల మంజూరు ఊసే లేదన్నారు. ఎందరో అభాగ్యులకు ఆసరాగా ఉన్న ఆరోగ్య శ్రీని రద్దు చేసి పేదలతో చంద్రబాబు ఆడుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ప్రాణాలంటే బాబుకు లెక్కలేదని, ఎప్పుడు చూసిన కార్పొరేట్ వ్యవస్థను గూర్చి ఎక్కువగా ఆలోచన చేస్తారని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని తెలిపారు, వైఎస్ జగన్ హయాంలో పేద బడుగు, బలహీన వర్గాల వారందరికీ లబ్ధిచేకూరిందన్నారు. చంద్రబాబు ఏ పథకం ప్రారంభించిన సగం సగమే ఇస్తారని, అన్నదాత సుఖీభవ,ఉచిత గ్యాస్, తల్లికి వందనం ఇలా అమలు చేసిన పథకాల్లో ప్రతి దాంట్లో సగమే ఇచ్చారని శ్రీమతి బుట్టా రేణుక విమర్శించారు.కె.ఆర్ మురారి రెడ్డి ,కామర్తి నాగేశప్ప ,బోయ బజారి , బోయరాజు ,మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో మునిగిన కూటమి నేతలు. ఇటీవల వెలుగులోకి వచ్చిన లిక్కర్ స్కామ్లో కూటమి నేతలే ఉన్నారన్నారు. కూటమి నేతలు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం మద్యం కుంభకోణాల్లో మునిగిపోయారని మండిపడ్డారు.మొన్న పోలీసులకు పట్టుబడిన లిక్కర్ సరఫరా రాకెట్లో ఉన్న సంబంధాలు ఎక్కడికి దారి తీస్తున్నాయో రాష్ట్ర ప్రజలకుతెలుసన్నారు.ఈ కార్యక్రమంలో 28వ వార్డు కౌన్సిలర్ బోయబజారి, పట్టణ యూత్ ప్రెసిడెంట్ బోయ రాజు, రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ, పట్టణ, అనుబంధ కమిటీలు అధ్యక్షులు నాయకులు,కౌన్సిలర్లు వార్డ్ ఇంచార్జ్ లు, వెంకటాపురం గ్రామం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

