కర్నూలు జీజీహెచ్లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్ కె.చిట్టి నరసమ్మ ఏర్పాటుచేసిన ప్రపంచ మానసిక వికలాంగుల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి హాజరయ్యారు. జడ్జి మాట్లడుతూ మానసిక వికలాంగులకు చట్టపరంగా అనేక సదుపాయాలు కలవని తెలిపారు. మానసిక రోగుల హక్కులు మరియు మానసిక రోగులను రక్షించడం మరియు వైద్య చికిత్స అందించడం వంటి విధుల గురించి తెలియజేసారు. ఈ సంవత్సరము ప్రపంచ మానసిక వికలాంగుల దినోత్సవం విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యము మరియు సేవలకు ప్రాధాన్యత అనే థీమ్ తో ప్రజలకు తెలియచేయాలని తెలిపారు. అనంతరం కాలేజీ వాళ్ళు చట్టం దృష్టిలో అందరికీ న్యాయ సహాయము అనే థీమ్ పై ఏర్పాటుచేసిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జడ్జి చేతులమీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ శ్రీనివాసులు, లీగల్ సర్వీస్ యూనిట్ నెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు మరియు వైద్య కళాశాల విద్యార్థులు మరియు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

