రాఘవేంద్రుని సన్నిధి లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసులు
1 min read

ఘనంగా స్వాగతం పలికిన జిల్లా అధ్యక్షులు, తిక్కారెడ్డి, టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసులు శుక్రవారం వచ్చారు. వీరికి టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి, టిడిపి మండల కన్వీనర్ పన్నగ వెంకటేష్ స్వామి తన అనుచరులతో ఘనంగా స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు లో జరిగిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పర్యటన కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మంత్రాలయం నియోజకవర్గం కూటమి నాయకులకు,కార్యకర్తలకు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసులు, టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి మాధవరం రాఘవేంద్ర రెడ్డి ధన్యవాదలు తెలిపారు. అనంతరం మంత్రాలయం టిడిపి ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నివాసంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసులు, టిడిపి జిల్లా అధ్యక్షులు అల్పాహారం స్వీకరించారు. అనంతరం టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ను, కర్నూలు జిల్లా అధ్యక్షులు ను రాఘవేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులు శాలువ కప్పి మొమొంటో ఘనంగా సన్మానించారు. నియోజకవర్గం అభివృద్ధి సమస్యల గురించి టిడిపి నాయకులకు ఉన్న సమస్యల గురించి రాష్ట్ర అధ్యక్షులతో మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని అలాగే టిడిపి నాయకులకున్న చిన్న చిన్న సమస్యలను త్వరలోనే తీర్చే విధంగా ముందుకు పోదామని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మాధవరం మాజీ సర్పంచి ఎన్.రఘునాథ్ రెడ్డి , మంచాల సొసైటీ చైర్మన్ ఎన్.రామకృష్ణ రెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు ఎస్ యం గోపాల్ రెడ్డి, నియోజవర్గ బసి సెల్ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, రాజారెడ్డి, నరవ రమాకాంత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, చావిడి వెంకటేష్, కౌతాలం ఉలిగయ్య, సురేష్ నాయుడు, వెంకటపతి రాజు, టిప్పుసుల్తాన్, కోసిగి ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, రచ్చమరి పోలి శివ, పోలి వీరేష్, మడివేల రాఘవేంద్ర, బారికి ఉరుకుందు,నాగరాజు, భీంరెడ్డి, నాలుగు మండలాల టిడిపి మండల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు మరియు టీడీపీ ఐటీడీపి అనుబంధ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

