NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల కేంద్రంలో మరియు కప్పట్రాల గ్రామంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆలూరు  వైసిపి ఎమ్మెల్యేబుసినే విరుపాక్షి  అధ్యర్యంలో దేవనకొండ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేసిన ప్రత్యేక శిబిరంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ.. కార్యక్రమంలో భాగంగా  ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ పేద విద్యార్ధి కూడా పెద్ద చదువులు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారని, అందులో భాగంగా వైద్య విద్య అందరికి చేరువగా అందుబాటులో ఉండాలని కొత్తగా 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని, కాని ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యను ప్రైవేటుపరం చేసే దిశగా, ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వైద్య విద్య చదువుకోవాలనే కలలు కనే ఒక సగటు విద్యార్థికి అన్యాయం చేయడం అని, దీనికి ప్రజలు, విద్యార్థులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని, దీనికి కోటి సంతకాల సేకరణకు వస్తున్న స్పందనే ఋజువని, కూటమి ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచన ఉపసంహరించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు, మరియు జిల్లా కమిటి సభ్యులు, జడ్పిటిసి, కన్వీనర్, కో కన్వీనర్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు, ఎంపిటిసి లు, వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు బివిఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author