మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది…
1 min read

మొక్కలు నాటిన మున్సిపాలిటి కమిషనర్..
పల్లెవెలుగు ,నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం “స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” స్వచ్ఛత”కార్యక్రమాన్ని మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. మూడవ శనివారం నిన్న మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి అక్కడ అపరిశుభ్రంగా ఉన్న వాటిని కమిషనర్ మరియు కార్యాలయ సిబ్బంది తొలగించారు.తర్వాత ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కమిషనర్ అన్నారు.అదేవిధంగా ఇంటిని, ఇంటి పరిసరాలను మరియు కార్యాలయ పరిధిలో శుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరి చేరవని మున్సిపాలిటీ కమిషనర్ బేబీ అన్నారు.ఈ కార్యక్రమంలో డీఈ నాసిర్, మున్సిపాలిటీ మేనేజర్ సుహ్రులత,రెవెన్యూ ఆఫీసర్ మధు బాబు,పట్టణ ప్లానింగ్ అధికారి రంగస్వామి,అకౌంట్స్ అధికారి శ్రీలత,అసిస్టెంట్ అకౌంట్ అధికారి విష్ణు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

