NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెప్మా కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన మెప్మా మిషన్ డైరెక్టర్

1 min read

ఏలూరు ప్రతినిధి,న్యూస్ నేడు: పట్టణ ప్రాంతాలలో జీవనోపాధి మరియు స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయడానికి అవసరమైన దిశా నిర్దేశం చేస్తూ మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ ప్రస్తుతం మెప్మా ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షా సమావేశం, గోదావరి కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.మెప్మా కార్యక్రమాల అమలులో పారదర్శకత , జవాబుదారీతనం మరియు మహిళల సామర్ధ్యాన్ని పెంచే దిశగా మహిళాకాశం అనే డిజిటల్ యాప్ ను జిల్లాలో చిట్ట చివరి మెప్మా మహిళ వరకు చేరే విధంగా సిబ్బంది కృషి చేయాలని , రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం ప్రకారం  ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదంతో సిబ్బంది అందరూ మహిళలను జీవనోపాదుల వైపు నడిపించాలని వారికి ఉన్న అవకాశాలను మరియు బ్యాంక్ అందించే పధకాలను ఉపయోగించుకునే విధంగా సిబ్బంది అందరూ కృషి చేయాలని సిబ్బందికి సూచించారు..జిల్లాలోని ప్రతి మునిసిపాలిటీ లో  తృప్తి క్యాంటీన్ , అరకు కాఫీ ప్రాంఛైజీ వంటివి మెప్మా మహిళల ద్వారా ఏర్పాటు చేయాలని సూచించారు.. నవంబర్ 5 వ తేదీన నిపుణ-మెప్మా ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పరిధిలో నిరుద్యోగులకు  జాబ్ మేళా జరుగుతుందని దీనికి ప్రతి మునిసిపాలిటీ పరిధిలో మెప్మా విభాగం నందు నిరుద్యోగులు నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెప్మా అడిషనల్ మిషన్ డైరెక్టర్ శ్రీ.యన్.వెంకటేశ్వరరావు, SMM LH  NNR శ్రీనివాస్ , SMM IT  రంగాచారి, పి.మాధవి ,పిడి మెప్మా ఏలూరు జిల్లా వారు, జి.హెప్సిబా , పిడి మెప్మా పశ్చిమగోదావరి జిల్లా వారు రెండు జిల్లాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.

About Author