బుద్ధి వికాసానికి ఉపయోగపడేవి సద్గ్రంథాలు
1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.
ఉప్పలపాడులో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: మానవుడికి దేహ వికాసంతో పాటు బుద్ధి వికాసం కూడా ఎంతో అవసరమని, అటువంటి బుద్ధి వికాసాన్ని కలిగించే సద్గ్రంథాలు మనకు మహర్షులు ఎన్నెన్నో అందించారని వాటిని అధ్యయనం చేయడం వల్ల ఋషుల ఋణం కొంతైనా తీర్చుకున్న వారమవుతామని, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఓర్వకల్లు మండలం, ఉప్పలపాడు గ్రామంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి దేవస్థానం నందు ఐదు రోజుల ధార్మిక కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు పండితులు గరుడాద్రి వనజ కుమారి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ గౌరవాధ్యక్షులు, ఎ. నాగన్న, ఆలయకమిటీ అధ్యక్షులు అయ్యస్వామి, సేవకులు అయ్యన్న, లలితమ్మతో పాటు స్థానిక భక్తాదులు పాల్గొన్నారు.

