ఐక్య మత్యంతోనే గ్రామ అభివృద్ధి
1 min read

ఎంప్లాయీస్ అసోసియేషన్ సేవలు అభినందనీయం
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ఎమ్మిగనూరు డీస్పీ భార్గవి
చెప్పుడు మాటలు వినకండి :- సిఐ రామాంజులు
యం తండాలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు
గ్రామానికి సేవ చేయడమే ఎంప్లాయిస్ వేల్ఫేర్ అసోసియేషన్ లక్ష్యం
మాధవరం తండలో 5K రన్ కార్యక్రమం
మంత్రాలయం న్యూస్ నేడు : గ్రామ ప్రజల ఐక్యమత్యంతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని ఇందులో ఎంప్లాయీస్ అసోషియేషన్ సేవలు అభినందనీయమని ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి పేర్కొన్నారు. మంగళవారం దీపావళి పండుగ పురస్కరించుకొని మాధవరం తండా గ్రామంలో ఎం తాండ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన కోసం 5 కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ రామాంజులు తో కలిసి హాజరైన ఆమె ను ఎంప్లాయీస్ అసోషియేషన్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి శాలువ తో మొమొంటో ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజలు ఎంప్లాయీస్ అసోసియేషన్ వారిని చూస్తే ఆనందం గా ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడం ఐక్య ముత్యాన్ని సూచిస్తుందన్నారు.సందర్భంగా ఎంప్లాయి అసోసియేషన్ వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే తమ లక్ష్యం అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్లు వాడకం తగ్గించాలని ఉద్దేశ్యం తో జనపనారతో తయారుచేసిన బ్యాగులను డిఎస్పీ తో ఆవిష్కరించి , ఇంటింటికి పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం ఒక లక్ష్యంతో ముందుకు వెళతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, సభ్యులు కిష్టప్ప నాయక్ ,మహేంద్ర నాయక్ , నారాయణ నాయక్ , ముని నాయక్,గురునారాయణ నాయక్, రాజు నాయక్, లింగప్ప నాయక్ , పుష్పా , లక్ష్మీ , గ్రామ పెద్దలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

