ఆదోని టూ టౌన్ సిఐ పై చర్యలు తీసుకోవాలి
1 min read

-పత్తికొండలో న్యాయవాదులు నిరసన
పత్తికొండ, న్యూస్ నేడు: ఆదోనిలో సీనియర్ న్యాయవాది వెంకటేష్ పై ఆదోని టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దురుసుగా ప్రవర్తించి ఆయనను అవమానించడం సరికాదని, తక్షణమే జిల్లా ఎస్పీ సీఐ పై తగు చర్యలు తీసుకోవాలని పత్తికొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వై.మధు బాబు డిమాండ్ చేశారు. సోమవారం పత్తికొండ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్ట్ యందు పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు యందు న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. . అనంతరం పత్తికొండ బార్ అసోసియేషన్ సభ్యులు మరియు న్యాయవాదులు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోష్ణ దేవి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయవాదులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురాని యెడల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ బార్ సోసియేషన్ ట్రెజరర్ సూరజ్ నబి, న్యాయవాదులు ఎల్లారెడ్డి, మైరాముడు, గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ నాయుడు, శ్రీనివాసరెడ్డి, హనుమంత రెడ్డి, సత్యనారాయణ, నాగేష్, కృష్ణయ్య, నారాయణస్వామి, నాగభూషణం రెడ్డి, దామోదరచారి, నరసింహులు, నెట్టేకల్లు, వెంకటేశ్వర్లు, మునయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.

