NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సులవాయి విద్యార్థి బస్సు సమయానికి  నడపాలి

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హోళగుంద మండలం సులవాయి గ్రాము  సమయానికి బస్ నడపాలని మాజీ విద్యార్థి సంఘం నాయకులు నాగరాజు గ్రామస్తుడు శివ  విద్యార్థులు ఆర్టీసీ కార్యాలయంలో  అస్టెంట్ మేనేజర్ మల్లికార్జున సార్ వినతిపత్రం  ఇవ్వడం జరిగింది.  సులవాయి పెద్దహేట మూగమనగుంది సమతగేరి దాదాపు 100 మంది విద్య కోసం హెుళగుందకు వస్తున్నటువంటి బస్సులను పాఠశాల కళాశాల సమయానికి అనుకూలంగా నడపాలని విద్యార్థులు కోరారు.  తాము ప్రతిరోజు పాఠశాల కళాశాలకు వస్తున్నప్పటికీ బస్సుల ఆలస్యంతో తమకు ఆబ్సెంట్ పడుతుందని ఇదేవిధంగా ఆబ్సెంట్ పడితే హాజరు తక్కువ ఉందని హాల్ టికెట్లు ఇవ్వక పరీక్షలకు కూడా కూర్చోబెట్టరని విద్యార్థులు తెలిపారు.సాయంత్ర సమయంలో కూడా ఇంటికి వెళ్లేసరికి రాత్రి 7 ఐతుందని విద్యార్థులు తెలియజేసారు   తమకు పాఠశాల కళాశాల సమయానికి అనుకూలంగా బస్సులు, హొళగుంద కు సర్వీస్ లు నడపాలని కోరారు. ఇంతకుముందే అడిగినప్పటికీ అధికారుల నుండి స్పందన లేదని ఇదే జరిగితే పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో   సులవాయ్ సమతగేరి ముగుమానేగుంది విద్యార్థులు గ్రామ ప్రజలు  విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

About Author