మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
1 min read
డా. కె.వేణుగోపాల్, సీఈఓ సెట్కూరు
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా యువజన సంక్షేమ శాఖ – సెట్కూరు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, బి.క్యాంపు, కర్నూలు నందు మత్తుపదార్థాలు వ్యసనం – పర్యవసానాలు, సైబర్ క్రైమ్ అనే అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో సెట్కూరు సీఈఓ డా.కె.వేణుగోపాల్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల పై యువత, విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడితే విలువైన జీవితం కోల్పోవాల్సి వస్తుందన్నారు, మన సమాజం ఎదుర్కొంటున్న కీలక సమస్యలలో మాదక ద్రవ్యాల వాడకం ఒకటని, ప్రిన్సిపాల్ శ్రీమతి పి సరళా దేవి మాట్లాడుతూ, యువత చదువుకునే వయసులో చదువు ఫై మాత్రమే మనసు లగ్నం చేయాలనీ, విరామ సమయంలో క్రీడలలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, మిత్రుల తో సమయం గడపాలని, చడు స్నేహాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు పర్యవేక్షకులు శ్రీ శ్యాం బాబు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

