ఎంపీతో సమావేశమైన బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసూన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసూన సమావేశమయ్యారు…కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని ఎంపీ నివాసంలో ఆయన తో సమావేశమైన ఆమె, జిల్లాలోని పలు బీసీ సంక్షేమ హాస్టల్స్ భవనాల మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కోసం ఎంపీ నిధుల నుంచి నిధులు కేటాయించాలని కోరింది…ఈ సందర్భంగా ఎంపీ భవనాల మరమ్మత్తులకు తన ఎంపీ నిధులను కేటాయిస్తానని తెలిపారు…అనంతరం ఎంపీ మాట్లాడుతూ బీసీ సంక్షేమ హాస్టల్స్ అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయించి పలు హాస్టల్స్ లో భవనాల మరమ్మత్తులు, నూతన టాయిలెట్స్, షెడ్ల ను నిర్మించడం జరిగిందన్నారు… జిల్లాలో ని అన్ని బీసీ వసతి గృహలను అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

