జాబ్ మేళా కు విశేష స్పందన
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యం లో నిరుద్యోగ యువతీ, యువకుల కొరకు శ్రీ సాయి కృష్ణ డిగ్రీ డిగ్రీ కళాశాల, కర్నూలు నందు మెగా జాబ్ మేళా నిర్వహించటం జరిగింది. ఈ జాబ్ మేళా నందు 16 కంపెనీ ప్రతినిధులు ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూ లు నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 509 మంది నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొన్నారు. వీరిలో 196 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు.ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి , శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పి గోవర్ధన్ రెడ్డి మరియు అకడమిక్ డైరెక్టర్ కె.రోషిరెడ్డి ,జిల్లా ఉపాధి అధికారి దీప్తి , జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎల్. ఆనంద్ రాజ్ కుమార్ , ప్రిన్సిపాల్ మహాబూబ్ బాషా, నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ,మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

