NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీల నిర్వహణ

1 min read

పత్తికొండ, న్యూస్ నేడు : నవంబర్ 26న జరిగే సంవిధాన దినోత్సవం సందర్భంగా పత్తికొండ నియోజకవర్గం లోని ఐదు మండలాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాసర రచన, వకృత్వo, క్విజ్ పోటీలను నిర్వహించారు. పత్తికొండ నియోజకవర్గం లోని పత్తికొండ తుగ్గలి మద్దికేర వెల్దుర్తి కృష్ణగిరి మండలాల్లోని మండలానికి ముగ్గురు విద్యార్థులు చొప్పున ఈ పోటీలలో పాల్గొన్నారు. మండల స్థాయిలో ఎన్నికైన విద్యార్థులు నియోజకవర్గ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. నియోజకవర్గ స్థాయిలో 15 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలు మండల విద్యాధికారులు రాజా రామ్మోహన్, రమేష్ సుల పర్యవేక్షణలో జరిగాయి. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు మెమొంటోలను అందజేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన ఏపీఎస్ డబ్ల్యూ ఆర్ విద్యార్థిని ఈ గాయత్రి ప్రథమ స్థానం లోను, అదే మండలానికి చెందిన బోయినపల్లి జెడ్పి జిహెచ్ఎస్ విద్యార్థిని జి పద్మావతి ద్వితీయ స్థానంలోనూ, ఎస్ మహబూబ్ నిషా తృతీయ స్థానంలో నిలిచారు. ప్రథమ స్థానంలో నిలిచిన గాయత్రి కి ఈనెల 26న అసెంబ్లీలో పాల్గొనే అవకాశం ఉంటుందని విద్యా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కాటo శ్రీదేవి, ఉపాధ్యాయ బృందం భ్రమరాంబ, శ్యామల, రామాంజనేయులు, సరస్వతి, పద్మావతి, సత్యనారాయణ, తులసీదర్ రెడ్డి, వెల్దుర్తి, మండలాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులలో రాజ్యాంగ స్ఫూర్తి, హక్కులు మరియు బాధ్యతల పట్ల అవగాహన పెంపొందించడంలో పాఠశాలల పాత్రను ప్రశంసించారు.

About Author