NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు మెడికల్ కాలేజీ కీర్తి ప్రతిష్టలు కొనసాగించండి..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: పేద రోగులే గొప్ప వైద్య బోధకులు.. రోగుల బాదలను, ఇబ్బందులను, సమస్యలను ఓపిగ్గా వినండి.. రిటైర్డ్ అడిషనల్ డీఎంఈ & కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా సుధాకర్… “సాంస్కృతి కార్యక్రమాలతో “అలరించిన యువ వైద్య కెరటాలు”… యువ వైద్య విద్యార్థులు కర్నూల్ మెడికల్ కాలేజీ కీర్తి ప్రతిష్టలు ఎంతో ఘనమైనదని  దాన్ని  కొనసాగించాలని రిటైర్డ్ అడిషనల్ డి.యం.ఈ & రిటైర్డు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా.సుధాకర్  పిలుపునిచ్చారు. నూతనంగా వైద్య విద్యలో ప్రవేశించిన మొదటి సంవత్సరం 2025 బ్యాచ్ వైద్య విద్యార్థులకు 2023 బ్యాచ్ ఎంబి.బి. యస్ సీనియర్ విద్యార్థులు “విహాన్ 2025” పేరుతో “ఫ్రెషర్స్ డే” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ  వైద్య విద్య గొప్ప వరమని పేద రోగులు బోధకులుగా మారి వైద్య విద్యను అందిస్తారని వారి ఎడల ఓపికతో ఎంపతి తో వివహరించి సమస్యలను  తెలుసుకోవాలని అప్పుడే కచ్చితమైన  వైద్యాన్ని అందించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సీనియర్ జూనియర్ విద్యార్థులు కలిసి అలరించిన  సాంస్కృతి కార్యక్రమాలు ఉత్సాహంగా కేరింతలతో కొనసాగాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ సూపరిన్డెంట్ డాక్టర్  వెంకటేశ్వర్లు, స్టేట్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్, రీజినల్ ఐ హాస్పిటల్ సూపరిన్డెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ హరి చరణ్, డాక్టర్ సాయి సుధీర్, డాక్టర్ రేణుకాదేవి, డాక్టర్ విజయ్ ఆనంద్ బాబు, డాక్టర్ సిందియా శుభప్రద, వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు సీనియర్ జూనియర్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author