హోళగుందలో సీజనల్ హాస్టల్స్ ప్రారంభం
1 min read

వలస విద్యార్థుల ఆశకిరణం సీజనల్ హాస్టల్స్
ఎస్సై దిలీప్ కుమార్, ఎంఈఓ సుధారాణి కబీర్ సబ్
హొళగుంద న్యూస్ నేడు : వలస విద్యార్థులకు సీజనల్ హాస్టల్స్ ఆశ కిరణం లాంటివని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దిలీప్ కుమార్ ఎం ఈ ఓ లు సుధారాణి, కబీర్ సాబ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన హోళగుందలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమగ్ర శిక్ష సౌజన్యంతో అంబేద్కర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మరియు వరలక్ష్మి సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ఆధ్వర్యంలో నిర్వహించు సీజనల్ హాస్టల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు వలస వెళ్లితే వారి పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సీజనల్ హాస్టల్స్ ను విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకోవాలని సూచించారు హాస్టల్ విద్యార్థిని విద్యార్థులు చెరువులు బావులు ఎల్ఎల్సీ కాలువలకు స్థానాల కోసం వెళ్లకుండా ఇక్కడే స్నానం చేయాలని జరగరానిది ఏదైనా జరిగి ప్రమాదాలు సంభవిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు లక్ష్మప్ప తుకారాం రేణుక జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు కబీర్ సాహెబ్ ఎంపీపీ ఎస్ టెన్త్ వార్డు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్నయ్య రెడ్డి, ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు సిహెచ్ నాగరాజ్, ఎమ్మార్సీ సిబ్బంది, సీజనల్ హాస్టల్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


