NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వందేమాతర గీతాలాపనతో శోభా యాత్ర

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు :  ప్యాపిలి పట్టణంలో  శ్రీ సరస్వతీ శిశు మందిరం హై స్కూల్ అధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించి వందేమాతర గీతాలాపనతో శోభా యాత్ర కొనసాగించారు. పట్టణంలోని బస్టాండ్ సమీపాన అంబేద్కర్ విగ్రహం వద్ద వందేమాతర గీతాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమం లోసమితి కార్యదర్శి  ఎం. రామాంజినేయులు,పాఠశాల అధ్యక్షులు పార్థసారథి , పాఠశాల కార్యదర్శి బి.సి.విజయకుమార్ వందేమాతరం గురించి మాట్లాడుతూ ఈ గీతాలాపన పుట్టి నేటికీ 150   సంవత్సరాలు అయిందని, ఈ గీతలాపన ఆనంద్   మఠ్ నవల ఆధారంగా రచించబడింది అని, దీనిని బంకించంద్ర చట్టర్జీ రచించారాని మొదలగు విషయాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షులు కె.ఎస్.వి. రామాంజినేయులు, కృష్ణా రెడ్డి స్వామి మరియు ఆచార్యులు వాసు, రమణయ్య, రమణ మరియు మాతాజీలు అపర్ణ , స్వరూప, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author