NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు లో ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవం

1 min read

బధిరుల పాట శాలకు ఫెడరేషన్ ఆధ్వర్యంలో,ఎమ్మెల్యే బడేటి సమక్షంలో రూ 50

వేలు విరాళo ప్రకటించిన దాత మిల్లు బాబు

జర్నలిస్టులు సేవా దృక్పథంతో మరింత ముందుకు సాగాలి

జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి,ఎస్పి కె.ప్రతాప్ శివ కిషోర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జర్నలిస్ట్ లు తమ వృత్తి ధర్మం చిత్త శుద్ధితో నిర్వహించడం తోపాటుసేవా తత్పరత కలిగి ఉండటం గొప్ప విషయం అని ఈ సందర్బంగా ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ నాయకత్వం అభినంద నీయులని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసిం చ్చారు.ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏ పి డబ్ల్యూ జె ఎఫ్) 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం  కేంద్రం ఏలూరు లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి, ఏఎంసీ చైర్మన్ మావుళ్ళపల్లి పార్థసారథి, ఇలా చైర్మన్ పి.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దొండపాడు లోని బదీరుల పాటశాలలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శు జబీర్, వై.వి.హరీష్ అధ్యక్షతన మరియు సంఘ సభ్యుల  దాతలసహాకారం తో పరివర్తన బధిరుల (చెవిటి మూగ) కొందరు.విద్యార్థులకు వినికిడి పరికరాలుఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు.అనంతరం ఫెడరేషన్ నాయకులు జిల్లా కలెక్టర్,ఎస్ పి ని కలిసి తమ సంఘం కార్యకలాపాలు వివరించి బొకే,మెమేంటోఅందించి శుభాకాంక్షలు తెలిపారు. ఫెడరేషన్ కార్య కాలాపాలు అడిగి తెలుసు కున్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి,ఇడా శివప్రసాద్, చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు కె. చిన్నారావు,సీనియర్ నాయకులు యూనియన్ గౌరవ అధ్యక్షులు కె.బాలశౌరి, ఉపాధ్యక్షులు యర్రా.జయదాస్, మిల్టన్,సతీష్, ప్రతాప్,సి.పి.శ్రీనివాసరావు సత్యనారాయణ,సజ్జి మ్యాథ్యూస్, చింతలపూడినియోజకవర్గం అధ్యక్షులు కె.చిన్నారావు,డి.దాస్, తదితరులు పాల్గొన్నారు.

About Author