NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవరగట్టును సందర్శించిన ట్రైనీ కలెక్టర్ల బృందం

1 min read

హొళగుంద న్యూస్ నేడు:  ట్రైనింగ్ లో భాగంగా హోళగుంద మండలానికి విచ్చేసిన ట్రైనీ కలెక్టర్లు శ్రీ శివాని, శివం సింగ్,మైఖేల్, నిధియా,,ఆల్ఫ్రెడ్, శివనేందరన్ బృందం మంగళవారం ఉదయం శ్రీ మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. వీరిని దేవరగట్టు చైర్మన్ వీర నాగప్ప మరియు కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకుని మూలవిరాట్ కు అభిషేకం మరియు ఆకు పూజతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. దేవరగట్టు బన్నీ ఉత్సవ విశేషాలు మరియు ఆలయ చరిత్రను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనం తమకెంతో ప్రత్యేకమని తెలిపారు .అనంతరం అన్నదాన కార్యక్రమానికి తమవంతుగా రూపాయలు 5021-00 రూపాయలు విరాళంగా అందించారు. ఆలయ కమిటీ సభ్యులు దేవరగట్టు చిత్ర పటాన్ని  గుర్తుగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్,వైస్ చైర్మన్, కమిటీ సభ్యులు, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు రంగస్వామి, మహమ్మద్ షఫీ,కోకిల తోట నాగరాజు, గజ్జెహళ్లి నాగరాజు మరియు నెరనికి, నెరనికి తాండ , కొత్తపేట గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

About Author