NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదర్శనీయుడు అబుల్ కలాం అజాద్ : ప్రిన్సిపాల్

1 min read

ప్యాపిలి , న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం అధ్యక్షతన  జాతీయ విద్యా దినోత్సవంను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సుబ్రమణ్యం  మాట్లాడుతూ భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం అజాద్  విద్యారంగానికి చేసిన సేవలకు గుర్తు గా ఆయన  జయంతిని  ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం ను జరుపుకుంటాం.  విద్య కేవలం పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం కాదని, అది మన మనస్సులను వికసింపజేసే ఒక శక్తి అని మనం గుర్తించాలి. మనం జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. విద్య ద్వారా సమాజంలో మార్పును తీసుకురావచ్చని, దేశ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దవచ్చని  విద్యార్థులకు వివరించాడు.విద్య మనకి జీవితం మార్పు చేకూర్చే శక్తి, విద్య వంటి దీపం ఒక్కసారి వెలిగితే, అది మన జీవితాల్లో చీకటి లేకుండా చేస్తుంది. ఒక సమాజం ప్రగతి సాధించాలంటే, విద్య ప్రతి ఒక్కరికి అందించాలి. కాబట్టి, ఈ జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా, విద్య పట్ల నిబద్ధతతో ఉండి, మంచి భవిష్యత్తు కోసం అందరం కలిసి కృషి చేద్దాం అని విద్యార్థులకు సూచించాడు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్  నవీన పాటి,అధ్యాపకులురామకృష్ణయ్య, ఓబులేసు,మద్దిలేటి, వెంకటరమణ,ముస్తాక్,మురళి మోహన్,వెంకటేశ్వర్లు,శంకరయ్య,సురేష్,వన్నూర్,మంజునాథ్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు.

About Author