NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలి

1 min read

హొళగుంద న్యూస్ నేడు: ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలి…ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రి అప్ గ్రేడ్ చేసేందుకు సహకరించండిట్రైనీ ఐఏఎస్ లకు వినతి పత్రం ఇచ్చిన టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు…. అబ్దుల్ సుబాన్, సిబిఎన్ ఆర్మీ మోయిన్,వలి బాషా,తాహెర్… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల మండలమైన హోళగుంద ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక ప్రజలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిగా అభిరేడ్ చేస్తే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు.

About Author