బైరాపురంలో”స్వామిత్వ” గ్రామసభ..
1 min read

సభలను వినియోగించుకోండి
మిడుతూర్ ఎంపీడీఓ దశరథ రామయ్య..
మిడుతూరు , న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతురుమండల పరిధిలోని బైరాపురం గ్రామంలో మంగళవారం ‘స్వామిత్వ’గ్రామసభ ఉప సర్పంచ్ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ దశరథ రామయ్య మాట్లాడుతూ 9(2) నోటీసులు ఇదివరకే తీసుకున్న యజమానులు తమ ఇంటి కొలతలు సరిగ్గా ఉన్నాయని తెలియజేసిన వారి చేత సంతకంతో అంగీకార పత్రంకూడా తీసుకునే కార్యక్రమం జరిగింది.9(2) నోటీసులు జారీ చేసిన ఇంటి యజమానుల పేర్లు,కొలతలు ఇంటి యొక్క చెక్ బందీ దిక్కులలో ఎవరు నివసిస్తున్నారు మొదలగు వివరాలను ప్రజలకు వివరించినట్లుగ్రామ సభకు హాజరుకాని ఇంటి యజమానుల యొక్క ఇండ్ల దగ్గరికి వెళ్లి రేపటినుండి వారిని విచారించి వారి ఇంటి కొలతలు ఇచ్చిన నోటీసుల్లో సరిగా ఉన్నాయని భావించిన వారి సంతకాలతో అంగీకార పత్రాలు తీసుకోవాలని స్వామిత్వ సిబ్బంది తయారు చేసిన కొలతలు పట్ల అభ్యంతరం ఉన్న వారి యొక్క అర్జీలను కూడా సంబంధిత ఫార్మాట్లో తీసుకొని రెండు రోజుల్లో సదరు కార్యక్రమం పూర్తిచేసి పూర్తి రిపోర్ట్ సిద్ధం చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు. ఈరోజు బుధవారం జలకనూరులో,రేపు రోలళ్లపాడు,14 న అలగనూరు,15న దేవనూరు, 18 చింతలపల్లి,19 చెరుకు చెర్ల,20 చౌటుకూరు,21 తలముడిపి,22 తిమ్మాపురం,25 వీపనగండ్ల గ్రామాల్లో గ్రామసభలో ఉన్నాయని వీటిని ప్రజలందరూ గ్రామ సభకు వచ్చి వినియోగించుకోవాలని ఎంపీడీవో కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సంజన్న. పంచాయితీ కార్యదర్శి కే.కేశావతి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

