NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వర్ణోత్సవ సంబరాలు..

1 min read

50 వసంతాల విద్యా సేవలో కర్నూలు మాంటిస్సోరి పాఠశాల

కర్నూలు , న్యూస్​ నేడు: కర్నూలు నగరంలో విద్య ప్రమాణాలకు మారుపేరుగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన కర్నూలు మాంటిస్సోరి పాఠశాల ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. 50 వసంతాల విద్యా యజ్ఞం పూర్తి చేసుకొని స్వర్ణోత్సవ శోభను సంతరించుకోవడం కర్నూలు పట్టాణానికే గర్వకారణం. ఈ సందర్భంగా స్వర్ణ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి పాఠశాల యాజమాన్యం సిద్ధమవుతున్నది.50 సంవత్సరాల క్రితం కర్నూలునందలి విద్యా నగర్లో కేవలం 12 మంది విద్యార్థులతో ఒక చిన్న మొక్కగా ప్రస్థానం ప్రారంభించి నేడు శాఖోపశాఖలుగా విస్తరించి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని 9 ప్రాంతాలలో శాఖలను విస్తరించి సమర్ధవంతంగా నిర్వహించబడుతోంది. నాణ్యమైన విద్య వినూత్న బోధన పద్ధతులు అద్భుతమైన ఫలితాలతో ఈ రాయలసీమలోనే ఒక మకుటాయమాన విద్యా సంస్థగా మాంటిస్సోరి పాఠశాల ఎదిగింది. ఎందరో ప్రముఖులను, నిష్ణాతులను తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఈ పాఠశాలది. ఐదు దశాబ్దాలుగా విద్యను బోధించడమే కాకుండా వేలాది మంది విద్యార్థులను భావి భారత ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దిన విద్యా దేవాలయం ఇది. ఇక్కడ చదువుతో పాటు విలువలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. క్రమ శిక్షణ, నిజాయితీ, పెద్దల పట్ల గౌరవం, సామాజిక స్పృహ వంటి మహోన్నత లక్షణాలను విద్యార్థి మదిలో నింపడం ఈ పాఠశాల ప్రత్యేకత.మాంటిస్సోరి అనేది కేవలం పాఠశాల పేరు కాదు. నాణ్యతతో కూడుకున్న విద్యకు, సంస్కారానికి చిరునామాగా తీర్చిదిద్దిన పాఠశాల వ్యవస్థాపకులైన శ్రీమతి కళ్యాణమ్మ  కలను, సాకారం చేస్తున్న ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి, పూర్వ విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు. రాబోయే తరాలకు కూడా ఈ పాఠశాల ఇదే స్పూర్తితో వెలుగులు విరజిమ్మాలనఈ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల స్వర్ణ జయంతి ఉత్సవాలు ఈ నెల 12వ తారీఖున మన రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు డాక్టర్ అబ్దుల్ నజీర్  చేతుల మీదుగా ప్రారంభించబడుతున్నవి. ఈ కార్యక్రమంలో ఇదే పాఠశాల పూర్వ విద్యార్థి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టి.జి. భరత్ , కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బి. నాగరాజు , నంద్యాల పార్లమెంటు సభ్యులు డా. బైరెడ్డి శబరి , ఆదోని శాసనసభ్యులు శ్రీ పార్థసారథి , కోడుమూరు శాసన సభ్యులు శ్రీ పి. దస్తగిరి , నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ జయసూర్యగారు, ఎమ్మిగనూరు శాసనసభ్యులు శ్రీ జయ నాగేశ్వర రెడ్డి , కర్నూలు రేంజ్ డి.ఐ.జి. శ్రీ కోయ ప్రవీణ్  మరియు కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి  మరియు ఇతర ప్రముఖులు పాల్గొనబోతున్నారు.ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వాములు కావాలని ఈ శుభ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాలని కోరుకుంటూ పాఠశాల పూర్వ విద్యార్థులు, పూర్వ ఆధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు మరియు పుర ప్రముఖులను సాదరంగా పాఠశాల వారు ఆహ్వానిస్తున్నారు.

About Author