పచ్చదనం- పరిశుభ్రతతోనే సుస్థిరాభివృద్ధి
1 min read

ప్రిన్సిపల్ డి పి ఆర్ సి ఓబులమ్మ
న్యూస్ నేడు చెన్నూరు: గ్రామాలలో పచ్చదనం- పరిశుభ్రతతోనే ప్రజలకు స్థిర అభివృద్ధి కలుగుతుందని ప్రగతికి పట్టుకొమ్మలైన గ్రామాలలో పచ్చదనం- పరిశుభ్రతతో ప్రజలందరూ మెలగాలని జిల్లా పరిషత్ ఎగ్జిక్యూటివ్ అధికారి ప్రిన్సిపల్ డి పి ఆర్ సి ఓబులమ్మ అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో భవనం నందు గల సభ భవనం నందు జిల్లాలోని కార్యదర్శులకు డి ఎల్ టి ఓ లకు డి ఎల్ పి ఓ లకు లక్ష్యాలలో భాగంగా థీమ్ 5 పరిశుభ్రత పచ్చదనం హరిత గ్రామాల గురించి సీఈఓ ఓబులమ్మ ఆధ్వర్యంలో శిక్షణకార్యక్రమంనిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఓబులమ్మ మాట్లాడుతూ, గ్రామాలలో ప్రజలకు కావలసిన మౌలిక వసతులలో భాగంగా త్రాగునీరు, రహదారులు, పర్యావరణం, పరిశుభ్రత, పచ్చదనం వంటి వనరులు సమకూర్చే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆమె తెలిపారు. అలాగే గ్రామాలలో ప్రజలకు పేదరికం లేకుండా, సామాజిక న్యాయం సమకూర్చేలా, భద్రత భరోసా ఇచ్చేలా, అందరూ స్నేహపూర్వకంగా సుస్థిరత నెలకొనేలా గ్రామాలు అభివృద్ధి చెందేలా చూసుకోవలసిన బాధ్యత అధికారుల మైన మన పై ఉందని ఆ దిశగా అందరు కలిసి మెలిసి ఉండేలా గ్రామాలను తీర్చిదిద్దాలని ఆమె అన్నారు. అలాగే ఎస్ డబ్ల్యూ పిసీ కేంద్రాల ద్వారా రైతులకు ఉపయోగపడే ఎరువులు తయారవుతాయని అవి ప్రజల నుండి సేకరించిన చెత్త ద్వారానేనని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలా గ్రామాలలో సేకరించిన తడి చెత్త పొడి చెత్త సేకరించి తద్వారా ఎరువులు తయారుచేసి రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకొని వారి వారి గ్రామాలలోని ప్రజలకు వీటిపై సమగ్రంగా చర్చించి వారికి అవగాహన కల్పించి గ్రామాల అభివృద్ధికి మలుచుకోవాలని ఆమె తెలియజేశారు.ఈ ఫ్యాకల్టీ అధికారి సరళ, డిపిఓ రాజ్యలక్ష్మి బద్వేలు డి ఎల్ డి వో వీవీ శేషయ్య, జిల్లా ఇంచార్జ్ అధికారి మైథిలి , జిల్లా కోఆర్డినేటర్ రమణారెడ్డి ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, డీటీఎం డిపిఆర్సి ఆర్పీలు, ఎఫ్టిసిలు జిల్లా లోని అందరూ ఎంపీడీఓ లు డిప్యూటీ ఎంపీడీఓ లు పాల్గొన్నారు.

