NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికి కనీసం క్వింటానకి 12 వేల రూ. మద్దతు ధర ఇవ్వాలి            

1 min read

ప్రభుత్వమే సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి

 రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి. రామచంద్రయ్య

 పల్లె వెలుగు, పత్తికొండ: కర్నూలు జిల్లా లో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసారని, పత్తి పంట కు కనీసం క్వింటానకి12,000/- రూపాయలు ప్రకారం ప్రభుత్వమే సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రఅధ్యక్షులు పి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. మంగళవారం  కర్నూలు జిల్లా పత్తికొండ లోని సీపీఐ కార్యాలయం చదువులు రామయ్య భవన్ నందు రాష్ట్ర స్థాయి పత్తి రైతుల సమ్మేళనం ఆహ్వాన కరపత్రాలను రైతు సంఘం పత్తికొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బి. సురేంద్ర కుమార అధ్యక్షతన విడుదల చేసారు.ఈ సందర్భంగా పి. రామచంద్రయ్య మాట్లాడుతూ, పత్తి రైతుల రాష్ట్ర స్థాయి సమ్మేళనం కర్నూలు జిల్లా ఆదోని లో ఈ నెల18 – 19 తేదీలలో రోషన్ గార్డెన్స్ లో జరుగుతుందని అన్నారు. పత్తి రైతులు ఎకరానికి 80 వేల రూపాయలు పెట్టుబడులు పెట్టారని అన్నారు. అధిక వర్షాలు వల్ల పత్తికాయలకు పురుగు వచ్చి నెలరాలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.అరకొర పండిన పత్తిపంటను ఆదోని వ్యవసాయ మార్కెట్ లో కనీస మద్దతు ధర దొరకక రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం నిర్వహించిన మద్దతు ధర ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. ఆదోని వ్యవసాయ మార్కెట్ లో దళారీల దోపిడీ పెరిగి పోయిందిన అన్నారు. ప్రభుత్వ పరంగా దీనిని అరికట్టే వారు లేరన్నారు. మార్కెట్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవరిస్తున్నారని అన్నారు. వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి పత్తి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో పత్తి రైతుల సమస్యలును పరిష్కరించలని డిమాండ్ చేస్తు రాష్ట్ర స్థాయి పత్తి రైతుల సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు.

About Author