NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా  మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి 

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  మంగళవారం పత్తికొండ మహమ్మదీయ మస్జిద్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముస్లిం పెద్దలు మరియు మదర్స పిల్లలు పాల్గొని ఆజాద్ జయంతి ఘనంగా నిర్వహించారు. మహమ్మదీయ మస్జిద్ ప్రెసిడెంట్ శాబ్ద్ధిన్ నూర్ బాషా మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని భారతదేశంలో “జాతీయ విద్యా దినోత్సవం”గా జరుపుకుంటారని తెలిపారు, ఎందుకంటే అతను స్వాతంత్ర్య భారతదేశం యొక్క తొలి విద్యా మంత్రిగా పనిచేశారని అన్నారు. జయంతి: అతను భారతదేశం యొక్క తొలి విద్యా శాఖ మంత్రి మరియు స్వాతంత్ర్య సమరయోధుడని తెలిపారు. ఈ రోజును “జాతీయ విద్యా దినోత్సవం”గా జరుపుకుంటామని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కానగరంలో 1888 నవంబరు 11 న జన్మించారని, అతని తల్లి ఒక అరబ్, షేక్ మహ్మద్ జహీర్ వత్రి, అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాల ఉన్న ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వెళ్లి అక్కడే స్థిరపడ్డారని తెలిపారు.1890 లో అయన తన కుటుంబంతో కలకత్తా వెళ్లాడు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అభ్యసించాడు. అతని విద్య ఇంట్లోనే సాగింది. మొదట తండ్రి, పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్ మొదట అరబిక్, పెర్షియన్ నేర్చుకున్నాడు. తరువాత తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం అభ్యసించాడని పేర్కొన్నారు.అతను దివ్య ఖురాన్ పై భాష్యం వ్రాసారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహ్మదీయ మస్జిద్ మౌలానా హాబీబుల్ల గారు,కమిటీ సభ్యులు సాబ్ద్దిన్ మహబూబ్ బాషా, శాబ్ద్దీన్ జాకీర్ హుస్సేన్,కొల్కర్ సద్ధం,దొంగ్రి సద్ధం ఆమన్,బిళల్ మస్జిద్ ప్రెసిడెంట్ ఖాదర్,తదితరులు పాల్గొన్నారు.

About Author