NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైఎస్ఆర్సిపి 

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  మంగళవారం  పత్తికొండ పట్టణంలోని బృందావన కాలనీ మరియు ప్రతిభ కాలేజీ కాలనీలలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  ,మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ ,సర్పంచ్ కొమ్ము దీపిక, ఎంపీపీ నారాయణదాస్, రాష్ట్ర కమిటీ నాయకులు శ్రీరంగడు,సోమశేఖర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం  విజయవంతంగా చేపట్టారు.ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలనే సంకల్పంతో ప్రతి ఇంటి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సంతకాలు చేశారు.మాజీ ఎమ్మెల్యే  మాట్లాడుతూ, మాట్లాడుతూ, ప్రజా సేవే పథంగా తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. రైతు, మహిళ, విద్యార్థి, వృద్ధుడు, కార్మికుడు — ప్రతి వర్గాన్నీ ఆదుకోవడమే జగన్ మోహన్ రెడ్డి  పాలన లక్ష్యం. ఆ సేవాభావమే జగన్ ని ప్రజల మనసుల్లో అజరామరుడిగా నిలబెట్టింది,” అని పేర్కొన్నారు.కోటి సంతకాల సేకరణ ఉద్యమం ఆ ప్రజాభిప్రాయానికి ప్రతిబింబం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న విశ్వాసం ఇది మళ్లీ జగనన్న పాలనను సాక్షాత్కరిస్తుంది,” అని వారు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని ప్రజలతో ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ చేపట్టారు.ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో  కో ఆప్షన్ మెంబర్, టౌన్ ప్రెసిడెంట్, మైనారిటీ నాయకులు, వార్డు మెంబర్లు, ఎంపిటిసిలు, బూత్ కమిటీలు నాయకులు పాల్గొన్నారు.

About Author